రాణించిన హైదరాబాద్‌ క్రీడాకారులు

Telangna Taekwondo Team wins 5 Medals - Sakshi

 సీకే క్లాసిక్‌ అంతర్జాతీయ తైక్వాండో టోర్నమెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: సీకే క్లాసిక్‌ మలేసియా ఓపెన్‌ అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ క్రీడాకారులు ఐదు పతకాలను సాధించారు. మలేసియాలో జరిగిన ఈ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన పొన్నపల్లి శ్రీలేఖ హెవీవెయిట్‌ కేటగిరీలో స్వర్ణ పతకం సాధించగా... సాయి దీపక్‌ పటేల్‌ పూమ్సే విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.

మరోవైపు యామగుచి తైక్వాండో అకాడమీ వైఎంసీఏకి చెందిన పి. సంధ్య స్మిత, వితేశ్‌ చారి, బి. అభిషేక్‌ లాల్‌ కూడా ఈ టోర్నీలో ఆకట్టుకున్నారు. క్యోరుగి (ఫైట్‌) ఈవెంట్‌లో  వితేశ్‌ రన్నరప్‌గా నిలిచి రజతాన్ని సాధించాడు. అభిషేక్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని అందుకున్నాడు. మరోవైపు మహిళల పూమ్సే (కటాస్‌–గ్రూప్‌ ఫైట్‌) ఈవెంట్‌లో సంధ్య కాంస్య పతకాన్ని సాధించింది. ఈ సందర్భంగా పతకాలు సాధించిన క్రీడాకారులను వైఎంసీఏ కార్యదర్శి వినయ్‌ స్వరూప్‌ అభినందించారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top