సెమీఫైనల్లో సంజన | Telanganas Sanjana enters semifinals | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్లో సంజన

May 24 2019 10:16 AM | Updated on May 24 2019 10:16 AM

Telanganas Sanjana enters semifinals - Sakshi

ముంబై: రమేశ్‌ దేశాయ్‌ స్మారక సీసీఐ అండర్‌–16 జాతీయ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత్‌ నం. 1 క్రీడాకారిణి, హైదరాబాదీ సంజన సిరిమల్ల నిలకడగా రాణిస్తోంది. టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన సంజన బాలికల సింగిల్స్‌ విభాగంలో సెమీస్‌కు చేరుకుంది.

గురువారం జరిగిన బాలికల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సంజన (తెలంగాణ) 6–4, 7–5తో దియా భరద్వాజ్‌ (గుజరాత్‌)పై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో ఏడో సీడ్‌ రెనీ సింగ్లా (హరియాణా) 6–0, 6–2తో విధి జైన్‌ (గుజరాత్‌)పై, ఎనిమిదో సీడ్‌ పరీ సింగ్‌ (హరియాణా) 6–1, 6–2తో రేష్మా (కర్ణాటక)పై, అన్‌సీడెడ్‌ నైషా శ్రీవాస్తవ్‌ (కర్ణాటక) 6–3, 6–1తో భూమిక త్రిపాఠిపై విజయం సాధించి ముందంజ వేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement