
భారీ ఆధిక్యం దిశగా భారత్ ‘ఎ’
దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత ‘ఎ’ బౌలర్లు చెలరేగారు. ఫలితంగా సోమవారం మూడో రోజు ఆట ముగిసే సరికి దక్షిణాఫ్రికా ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. జేపీ డుమిని (222 బంతుల్లో 84; 9 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
రస్టెన్‌బర్గ్: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత ‘ఎ’ బౌలర్లు చెలరేగారు. ఫలితంగా సోమవారం మూడో రోజు ఆట ముగిసే సరికి దక్షిణాఫ్రికా ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. జేపీ డుమిని (222 బంతుల్లో 84; 9 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో ఈశ్వర్ పాండే 40 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మరో 270 పరుగులు వెనుకబడి ఉన్న నేపథ్యంలో... భారత్‌కు భారీ ఆధిక్యం ఖాయమైపోయింది. మంగళవారం మ్యాచ్‌కు చివరి రోజు కావడంతో ఈ టెస్టు డ్రాగా ముగిసే అవకాశం ఉంది. అయితే జట్టు బ్యాట్స్‌మెన్‌కు తోడు బౌలర్లు కూడా రాణించడం భారత్ ‘ఎ’కు శుభ పరిణామంగా చెప్పవచ్చు.
రాణించిన డుమిని...
20/1 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ ఆరంభంలోనే ఎల్గర్ (11) వికెట్ కోల్పోయింది. అయితే రోసో (64 బంతుల్లో 57; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), హార్మర్ (22) కలిసి మూడో వికెట్‌కు 72 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ దశలో హార్మర్‌ను అవుట్ చేసి పాండే దక్షిణాఫ్రికాను దెబ్బ తీశాడు. అనంతరం డుమిని కీలక ఇన్నింగ్స్‌తో జట్టు కోలుకుంది. కెప్టెన్ ఆంటాంగ్ (82 బంతుల్లో 47; 7 ఫోర్లు) తో కలిసి ఆరో వికెట్‌కు 75 పరుగులు, సొలెకిల్ (75 బంతుల్లో 47; 6 ఫోర్లు)తో ఏడో వికెట్‌కు 86 పరుగులు డుమిని జత చేశాడు. చివరి ఓవర్‌లో రైనా బౌలింగ్‌లో డుమిని అవుట్ కావడంతో మూడో రోజు ఆట ముగిసింది. రైనాకు 2 వికెట్లు దక్కాయి. ఏర్పాట్లు బాగున్నాయి: కార్ల్‌సన్