వారెవా.. రైనా వాట్‌ ఏ క్యాచ్‌! | Suresh Raina Takes Stunning Catch In Ranji Trophy Against Odisha | Sakshi
Sakshi News home page

వావ్‌ రైనా వాట్‌ ఏ క్యాచ్‌!

Nov 14 2018 8:29 PM | Updated on Nov 14 2018 8:55 PM

Suresh Raina Takes Stunning Catch In Ranji Trophy Against Odisha - Sakshi

భువనేశ్వర్‌: టీమిండియా క్రికెటర్‌ సురేశ్‌ రైనా అనగానే అభిమానులకు గుర్తొచ్చేది ఫీల్డింగ్‌లో వేగం, స్టన్నింగ్‌ క్యాచ్‌లు. గత కొంత కాలంగా సరైన ఫామ్‌లో లేక సతమతమవుతున్న రైనా టీమిండియాలో చోటు కొల్పోయాడు. దీంతో అతడి మెరుపులు చూసే అవకాశం అభిమానులు తెగ మిస్‌ అవుతున్నారు. అయితే రంజీ మ్యాచ్‌లో భాగంగా ఉత్తర్‌ ప్రదేశ్‌- ఒడిశా మ్యాచ్‌లో రైనా కళ్లు చెదిరే రీతిలో ఒంటి చేత్తో క్యాచ్‌ అందుకున్నాడు. దానికి సంబంధించిన వీడియా రైనా స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ స్టార్‌ ఫీల్డర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ‘రైనా ఈజ్‌ బ్యాక్‌’, ‘ఫీల్డింగ్‌లో రైనాకు సాటి లేరు’ అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. 

మూడో రోజు ఆటలో భాగంగా యూపీ బౌలర్‌ సౌరభ్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఒడిశా బ్యాట్స్‌మన్‌ సుజిత్‌ లెంకా ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న రైనా ఎడమవైపు డైవ్‌ చేస్తూ ఒంటి చేత్తో అందుకున్నాడు. రైనా స్టన్నింగ్‌ క్యాచ్‌తో బ్యాట్స్‌మన్‌ షాక్‌కు గురికాగ, యూపీ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. అయితే ఫీల్డింగ్‌లో అదరగొట్టిన రైనా బ్యాటింగ్‌లో మాత్రం నిరాశపరిచాడు. కేవలం పది పరుగులకే వెనుదిరిగాడు. ప్రపంచకప్‌లో పాల్గొనే టీమిండియా జట్టులో చోటు దక్కించుకోవడమే తన తదుపరి లక్ష్యమని ప్రకటించిన రైనా రంజీల్లో సత్తా చాటాలనే ఉద్దేశంతో ఉన్నాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement