
సాక్షి, స్పోర్ట్స్ : నాగ్‌పూర్ టెస్ట్‌లో టీమిండియా బౌలర్ల దాటికి లంక బ్యాట్స్‌మెన్లు పరుగుల కోసం చెమటోడుస్తున్నారు. టీ విరామానికి 59 ఓవర్లలో లంక 4 వికెట్లు కోల్పోయి.. 154 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీ సాధించిన ఎఫ్‌డీఎం కరుణరత్నేను ఇషాంత్ శర్మ ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపాడు.
ఇషాంత్‌కు రెండు వికెట్లు, అశ్విన్, జడేజాకు తలో వికెట్ పడ్డాయి. ప్రస్తుతం క్రీజులో ఛండీమాల్(47 పరుగులు), డిక్వెల్లా(18 పరుగులు) ఉన్నారు.