పాకిస్తాన్‌ 177 ఆలౌట్‌  | South Africa bowl Pakistan out for 177 | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ 177 ఆలౌట్‌ 

Jan 4 2019 3:20 AM | Updated on Jan 4 2019 3:20 AM

South Africa bowl Pakistan out for 177 - Sakshi

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికా పేసర్ల ప్రతాపానికి పాకిస్తాన్‌ మరోసారి కుప్పకూలింది. గురువారం రెండు జట్ల మధ్య ఇక్కడ ప్రారంభమైన రెండో టెస్టులో నలుగురు పేసర్లతో బరిలో దిగిన సఫారీలు... ప్రత్యర్థి ని తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే ఆలౌట్‌ చేశారు. ఒలివియర్‌ (4/48), స్టెయిన్‌ (3/48), రబడ (2/35) ధాటికి పాక్‌ నిలవలేకపోయింది. కెప్టెన్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ (56), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ షాన్‌ మసూద్‌ (44) మాత్రమే కొద్దిగా పోరాడారు. అనంతరం ఇన్నింగ్స్‌ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. మార్క్‌రమ్‌ (78) అర్ధశతకం సాధించి వెనుదిరిగాడు. అమ్లా (24 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. పాక్‌ స్కోరుకు సఫారీ జట్టు మరో 54 పరుగులు వెనుకబడి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement