
గత దశాబ్దకాలంగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నేలకుర్తి సిక్కి రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందించారు.
హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నివాసంలో వైఎస్ జగన్‌ను కలిసిన సిక్కి రెడ్డి ఈ సందర్భంగా వచ్చే నెలలో జరిగే తన వివాహానికి ఆహ్వానిస్తూ శుభలేఖను అందజేసింది. గతేడాది ప్రతిష్టాత్మక ‘అర్జున అవార్డు’ గెల్చుకున్న సిక్కి రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్ భవిష్యత్‌లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.