షంషుద్దీన్ మెరుపులు | shamsiddin century helps to noble cricket club victory | Sakshi
Sakshi News home page

షంషుద్దీన్ మెరుపులు

Aug 29 2016 11:00 AM | Updated on Sep 4 2017 11:26 AM

బ్యాటింగ్‌లో షంషుద్దీన్ (124; 13ఫోర్లు, 4 సిక్సర్లు), బౌలింగ్‌లో హిమాన్షు (6/49) చెలరేగడంతో ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో నోబుల్ క్రికెట్ క్లబ్ అలవోక విజయాన్ని సాధించింది.

సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్‌లో షంషుద్దీన్ (124; 13ఫోర్లు, 4 సిక్సర్లు), బౌలింగ్‌లో హిమాన్షు (6/49) చెలరేగడంతో ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో నోబుల్ క్రికెట్ క్లబ్ అలవోక విజయాన్ని సాధించింది. కులీ కుతుబ్ షా మైదానంలో విజయానంద్ క్రికెట్ క్లబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో నోబుల్ క్రికెట్ క్లబ్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నోబుల్ క్రికెట్ క్లబ్ 44.4 ఓవర్లలో 294 పరుగులకు ఆలౌటైంది.

 

షంషుద్దీన్ సెంచరీతో కదం తొక్కగా... హిమాన్షు చౌదరీ (54), లఖన్ (36) రాణించారు. విజయానంద్ బౌలర్లలో తేజ 3, విష్ణు 4 వికెట్లతో ఆకట్టుకున్నారు. అనంతరం విజయానంద్ క్రికెట్ క్లబ్ 47.2 ఓవర్లలో 282 పరుగులు చేసి ఓడిపోయింది. బాలాజీ రెడ్డి (109), అభిషేక్ సింగ్ (52), తరుణ్ సాయి (60) చివరి వరకు పోరాడారు. నోబుల్ బౌలర్లలో ఫహీముద్దీన్ 2 వికెట్లు పడగొట్టాడు.

 ఇతర మ్యాచ్‌ల వివరాలు

 న్యూస్టార్ : 120 (సిద్ధార్థ్ 46; నీల్ చక్రవర్తి 3/24, సాత్విక్ 2/29, మస్తాక్ అహ్మద్ 2/19);
 ఆల్‌సెయింట్స్ హైస్కూల్: 122/6 (శివ 67 నాటౌట్; జాన్ 3/27).
 సత్యసీసీ: 155/6 (రోహన్ 35, అక్షయ్ 31, ప్రజ్వల్ 30; శివ 2/21); లక్కీ ఎలెవన్: 156/3 (మహేశ్ 64 నాటౌట్; శ్రీహర్ష 2/20).


నిజాం కాలేజ్‌కు రాజీవ్ టోర్నీ టైటిల్

రాజీవ్‌గాంధీ యువ క్రికెట్ టోర్నమెంట్‌లో నిజాం కాలేజ్ జట్టు విజేతగా నిలిచింది. ఆరోరా కాలేజ్  జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో నిజాం కాలేజ్ జట్టు ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నిజాం కాలేజ్ 20 ఓవర్లలో 110 పరుగులు చేసింది. 111 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఆరోరా జట్టు 19.2 ఓవర్లలో 109 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్, తదితరులు పాల్గొన్నారు.


 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement