డబుల్స్‌ క్వార్టర్స్‌లో సంజన జంట | Sanjana Pair in Doubles Quarters | Sakshi
Sakshi News home page

డబుల్స్‌ క్వార్టర్స్‌లో సంజన జంట

Jan 30 2019 9:38 AM | Updated on Jan 30 2019 9:38 AM

Sanjana Pair in Doubles Quarters - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) జూనియర్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి సంజన సిరిమల్ల డబుల్స్‌ విభాగంలో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇండోర్‌లో మంగళవారం జరిగిన డబుల్స్‌ తొలి రౌండ్‌లో సంజన–రియా (భారత్‌) ద్వయం 6–4, 6–2తో అష్‌ప్రీత్‌ కౌర్‌ బజ్వా–నైషా శ్రీవాస్తవ్‌ (భారత్‌) జోడీపై విజయం సాధించింది. ఇదే టోర్నీ బాలుర డబుల్స్‌ తొలి రౌండ్‌లో వడ్డేపల్లి కార్తీక్‌నీల్‌ (భారత్‌)–ప్యాట్రిక్‌ స్పిగెల్‌ (స్లొవేనియా) జోడీ 2–6, 5–7తో నిశాంత్‌ దబస్‌–శక్తివేల్‌ భూపతి (భారత్‌) జంట చేతిలో ఓడింది. 

Advertisement
 
Advertisement
Advertisement