కాంస్యంతోనే సరి.. | Saina Nehwal, HS Prannoy go down fighting, settle for bronze | Sakshi
Sakshi News home page

కాంస్యంతోనే సరి..

Apr 28 2018 5:49 PM | Updated on Apr 28 2018 5:50 PM

Saina Nehwal, HS Prannoy go down fighting, settle for bronze - Sakshi

వుహాన్‌(చైనా):  ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌లు కాంస్య పతకంతోనే సరిపెట్టుకున్నారు. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో వీరిద్దరూ పరాజయం చెందడంతో కాంస్యంతోనే వెనుదిరిగాల్సి వచ్చింది.  టోర్నీలో భాగంగా మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో సైనా 25-27, 19-21 తేడాతో టాప్‌సీడ్‌ తైజు యింగ్‌(చైనీస్‌ తైపీ) చేతిలో ఓటమి పాలైంది. హోరాహోరీగా సాగిన పోరులో సైనా కడవరకూ పోరాడినా సెమీ ఫైనల్‌ అడ్డంకిని అధిగమించలేకపోయింది.
 

ఇక పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో ప్రణయ్‌ 16-21, 18-21తేడాతో ఒలింపిక్‌ చాంపియన్‌ చెన్‌ లాంగ్‌(చైనా) చేతిలో పరాజయం చెందాడు.  52నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో చెన్‌ లాంగ్ పైచేయి సాధించి ఫైనల్లోకి ప్రవేశించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement