టైటిల్ లక్ష్యంగా బరిలోకి హారిక | Russia in today's Grand Prix chess | Sakshi
Sakshi News home page

టైటిల్ లక్ష్యంగా బరిలోకి హారిక

Nov 18 2016 12:20 AM | Updated on Sep 4 2017 8:22 PM

టైటిల్ లక్ష్యంగా బరిలోకి హారిక

టైటిల్ లక్ష్యంగా బరిలోకి హారిక

మహిళల గ్రాండ్ ప్రి చెస్ సిరీస్‌లో భాగంగా గత జులైలో జరిగిన నాలుగో టోర్నీలో విజేతగా నిలిచిన ఏపీ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక మరో సవాల్‌కు సన్నద్ధమైంది.

నేటి నుంచి రష్యాలో గ్రాండ్ ప్రి చెస్

ఖాంటీ-మన్‌సిస్క్ (రష్యా): మహిళల గ్రాండ్ ప్రి చెస్ సిరీస్‌లో భాగంగా గత జులైలో జరిగిన నాలుగో టోర్నీలో విజేతగా నిలిచిన ఏపీ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక మరో సవాల్‌కు సన్నద్ధమైంది. ఈ ఏడాదిలో చివరిదైన ఐదో సిరీస్‌లో కూడా టైటిల్ లక్ష్యంగా హారిక బరిలోకి దిగుతోంది. రష్యాలోని ఖాంటీ-మన్‌సిస్క్‌లో నేడు ప్రారంభం కానున్న ఈ టోర్నీ డిసెంబర్ 2 వరకు కొనసాగుతుంది. మొత్తం 12 మంది ప్లేయర్లు క్లాసికల్ విభాగంలో 11 రౌండ్లలో తలపడతారు. ఏడాది మొత్తంలో ఈ సిరీస్‌లోని మొత్తం ఐదు టోర్నీలలో ప్రతీ ప్లేయర్ కనీసం మూడు టోర్నీలలో ఆడాల్సి ఉంటుంది. చైనాలో జరిగిన గత టోర్నమెంట్‌తోనే మూడు ఈవెంట్లు పూర్తి చేసుకున్న మరో తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపి ఇందులో బరిలోకి దిగడం లేదు. అన్ని టోర్నీలలో కలిపి సాధించిన మొత్తం పారుుంట్లను పరిగణలోకి తీసుకొని ఓవరాల్ చాంపియన్‌ను ఎంపిక చేస్తారు. టెహ్రాన్‌లో విఫలమై, చైనాలో టైటిల్ నెగ్గిన హారిక ఖాతాలో ప్రస్తుతం 190 పారుుంట్లు ఉన్నారుు. హంపి 335 పారుుంట్లతో ముగించింది.

‘గత టోర్నీ విజయం ఇచ్చిన ఉత్సాహంతో చివరి ఈవెంట్‌లోనూ బరిలోకి దిగుతున్నా. దీని కోసం చక్కగా సిద్ధమయ్యా. తీవ్రమైన పోటీ ఉన్న మాట వాస్తవమే అరుునా... బాగా ఆడగలనని విశ్వాసంతో ఉన్నా’ అని హారిక ‘సాక్షి’తో చెప్పింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్‌‌సలో ఆరో స్థానంలో ఉన్న హారిక ఇక్కడ టైటిల్ గెలిస్తేనే ఓవరాల్ విజేత అయ్యే అవకాశం ఉంటుంది. ‘బరిలో ఉన్న వారందరి మధ్య పారుుంట్ల తేడా చాలా తక్కువగా ఉంది. పలువురు అగ్రశ్రేణి క్రీడాకారిణులు బరిలో ఉన్నారు. అరుుతే టైటిల్ సాధించడమే నా లక్ష్యం’ అని హారిక వ్యాఖ్యానించింది. పెద్ద ప్లేయర్లను ఓడించడం మొదలు ర్యాంక్ మెరుగు కావడం వరకు 2016 సంవత్సరం తనకు అన్ని విధాలా కలిసొచ్చిందని, అదే జోరులో దీనిని ముగిస్తానని హారిక విశ్వాసం వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement