టేలర్‌ సరికొత్త రికార్డు

Ross Taylor Most Fifty Plus Scores For New Zealand Against India - Sakshi

ఆక్లాండ్‌: టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో సెంచరీ సాధించి విజయంలో కీలక పాత్ర పోషించిన న్యూజిలాండ్‌ వెటరన్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌.. ఆ దేశం తరఫున భారత్‌పై అత్యధిక వన్డే పరుగులు సాధించిన రికార్డును సైతం లిఖించిన సంగతి తెలిసిందే. కాగా, ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో సైతం టేలర్‌ మరో రికార్డును నమోదు చేశాడు. వన్డే ఫార్మాట్‌లో భారత్‌పై 50కిపైగా స్కోర్లను అత్యధికంగా సాధించిన న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే నాథన్‌ ఆస్ట్లే రికార్డును టేలర్‌ బ్రేక్‌ చేశాడు. భారత్‌పై 50కిపైగా స్కోర్లను టేలర్‌ 11వ సారి సాధించాడు. టీమిండియాపై రెండో వన్డేలో టేలర్‌ 73 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాంతో భారత్‌పై 10సార్లు యాభైకిపైగా స్కోర్లు సాధించిన ఆస్ట్లే రికార్డును టేలర్‌ సవరించాడు. ఈ జాబితాలో టేలర్‌, ఆస్ట్లే తర్వాత స్థానంలో స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌(9), కేన్‌ విలియమ్సన్‌(9)లు సంయుక్తంగా నాల్గో స్థానంలో ఉన్నారు. 

ఇది మూడో అత్యుత్తమ భాగస్వామ్యం
భారత్‌పై రెండో వన్డేలో కివీస్‌ 273 పరుగులు సాధించగా, 9వ వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. టేలర్‌తో కలిసి జెమీసన్‌ ఈ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. తద్వారా కివీస్‌ తరఫున 9 వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన మూడో జోడిగా వీరు నిలిచారు. ఇక ఆక్లాండ్‌లో 9వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం మాత్రం టేలర్‌-జెమీసన్‌లదే కావడం విశేషం.  (ఇక్కడ చదవండి: జడేజా.. నువ్వు సూపరమ్మా!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top