సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేసిన రోహిత్‌

Rohit Sharma breaks a Sachin Tendulkar record in ODIs - Sakshi

లండన్‌: టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సరికొత్త రికార్డు సాధించాడు. వన్డేల్లో ఆస్ట్రేలియాపై అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో రెండు వేల పరుగుల మార్కును చేరిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును రోహిత్‌ బ్రేక్‌ చేశాడు. ఆసీస్‌పై 37 ఇన్నింగ్స్‌ల్లోనే రోహిత్‌ రెండు వేల పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. దాంతో ఆసీస్‌పై అతి తక్కువ ఇన్నింగ్స్‌లో ఆ మార్కును చేరిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉండేది. వన్డేల్లో ఆసీస్‌పై రెండు వేల పరుగులు చేయడానికి సచిన్‌కు 40 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా, దాన్ని రోహిత్‌ తాజాగా సవరించాడు. ఆసీస్‌పై తక్కువ ఇన్నింగ్స్‌ల్లో రెండు వేల పరుగుల పూర్తి చేసుకున్న ఆటగాళ్లలో రోహిత్‌ శర్మ, సచిన్‌లు తొలి రెండు స్థానాల్లో ఉండగా, వివ్‌ రిచర్డ్స్‌(వెస్టిండీస్‌) మూడో స్థానంలో ఉన్నాడు.
(ఇక్కడ చదవండి: ధావన్‌-రోహిత్‌ల జోడి అరుదైన ఘనత)

ఇ‍క ఒక జట్టుపై అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో రెండు వేల వన్డే పరుగుల్ని పూర్తి చేసుకున్న ఆటగాళ్లలో జాబితాలో కూడా రోహిత్‌ అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఒక జట్టుపై రెండు వేల పరుగుల్ని వేగవంతంగా సాధించిన ఆటగాళ్లలో రిచర్డ్స్‌తో కలిసి కోహ్లి మూడో స్థానంలో ఉన్నాడు. కాగా,  కోహ్లి ఘనత శ్రీలంకపై ఉంది. శ్రీలంకపై రెండు వేల వన్డే పరుగులు చేయడానికి కోహ్లికి 44 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఇదిలా ఉంచితే, వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఆసీస్‌తో తాజా మ్యాచ్‌లో రోహిత్‌(57) హాఫ్‌ సెంచరీ సాధించాడు. ధావన్‌తో కలిసి  127 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన రోహిత్‌ తొలి వికెట్‌గా ఔటయ్యాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top