‘రియో’ బృందానికి మోదీ శుభాకాంక్షలు | Rio Olympics team congarts to Prime Minister Modi | Sakshi
Sakshi News home page

‘రియో’ బృందానికి మోదీ శుభాకాంక్షలు

Jul 5 2016 12:55 AM | Updated on Aug 24 2018 2:17 PM

‘రియో’ బృందానికి మోదీ శుభాకాంక్షలు - Sakshi

‘రియో’ బృందానికి మోదీ శుభాకాంక్షలు

రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ శక్తిమేర రాణించి పతకాలతో...

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ శక్తిమేర రాణించి పతకాలతో దేశానికి పేరు తేవాలని ఆకాంక్షించారు. సోమవారం ఇక్కడి మనేక్షా సెంటర్‌లో ఆటగాళ్లను కలిసిన మోదీ ఒక్కొక్కరితో సరదాగా మాట్లాడారు. అనంతరం ఆటగాళ్లతో సెల్ఫీలకు ఫోజిచ్చారు. కార్యక్రమం అనంతరం ట్వీటర్ ద్వారా కూడా మోదీ క్రీడాకారులకు శుభాకాంక్షలు చెప్పారు. పలువురు ఆటగాళ్ల ట్వీట్లకు స్పందించారు.

షూటర్స్ అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, గురుప్రీత్ సింగ్, జీతూరాయ్, మానవ్‌జీత్ సింగ్ సంధు, హీనా సిద్ధు, బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, కె. శ్రీకాంత్, బాక్సర్ శివథాపా, భారత మహిళల హాకీ జట్టు క్రీడాకారులు, లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్ సుధా సింగ్, లలితా బాబర్, రెజ్లర్ యోగేశ్వర్ దత్ పీఎంను కలిసిన వారిలో ఉన్నారు. వీరితో పాటు క్రీడా శాఖ మంత్రి జితేంద్ర సింగ్, కార్యదర్శి రాజీవ్ యాదవ్, జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్,  భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్. రామచంద్రన్, కార్యదర్శి రాజీవ్ మెహతా, హాకీ ఇండియా అధ్యక్షుడు నరేందర్ బాత్రా మోదీతో సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement