అంపైర్లు అప్రమత్తంగా ఉండాలి: ఐపీఎల్‌ చైర్మన్‌ | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 24 2018 5:56 PM

Rajiv Shukla Says Umpires Told to Be More Vigilant - Sakshi

న్యూఢిల్లీ : మైదానంలో​ అంపైర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా సూచించారు. రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ మ్యాచ్‌లో ఓవర్‌లో 7 బంతులు వేయించడం.. ఉప్పల్‌లో చెన్నై-సన్‌రైజర్స్‌ మ్యాచ్‌లో స్పష్టమైన నోబాల్‌ను ఇవ్వకపోవడంతో అంపైర్ల విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌, కింగ్స్‌ పంజాబ్‌ మ్యాచ్‌కు హజరైన శుక్లా.. అంపైర్ల తప్పిదాలపై స్పందించారు. ‘ఇలాంటి తప్పిదాలు కొన్ని సార్లు జరుగుతుంటాయి. అంపైర్లు అప్రమత్తంగా వ్యవహరించేలా మ్యాచ్‌ రిఫరీలు వారితో చర్చించాలని’ పేర్కొన్నారు.

ఇలాంటి చిన్న తప్పిదాలు జరగకుండా అంపైర్లు అవసరమైతే టెక్నాలజీ సాయం తీసుకోవాలని మరో ఐపీఎల్‌ అధికారి అభిప్రాయపడ్డారు. ఎవరు కావాలని తప్పిదాలు చేయరని ఆయన పేర్కొన్నారు. ఇక చెన్నై మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓటమికి అంపైర్‌ నిర్ణయమే కారణమని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

సన్‌రైజర్స్‌-రాజస్తాన్‌ మ్యాచ్‌లో ఘోర తప్పిదం

పాండ్యా నాటౌట్‌..! చిర్రెత్తిన కోహ్లీ

‘అంపైర్‌ వల్లే సన్‌రైజర్స్‌ ఓటమి’  

Advertisement
Advertisement