నిలడకగా రాహుల్ ఘోష్ ఆరోగ్యం | Rahul Ghosh, Another Young Cricketer Hospitalised in Kolkata with On-field Injury | Sakshi
Sakshi News home page

నిలడకగా రాహుల్ ఘోష్ ఆరోగ్యం

Apr 23 2015 1:04 AM | Updated on Sep 3 2017 12:41 AM

స్థానిక లీగ్ మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడిన కోల్‌కతా ఆటగాడు రాహుల్ ఘోష్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది.

కోల్‌కతా: స్థానిక లీగ్ మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడిన కోల్‌కతా ఆటగాడు రాహుల్ ఘోష్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. మంగళవారం జరిగిన బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) రెండో డివిజన్ లీగ్ మ్యాచ్‌లో తను గాయపడ్డాడు. పోలీస్ ఏసీ తరఫున ఆడిన తనకు చెవి కింది భాగంలో బంతి వేగంగా వచ్చి తగిలింది.
 
 అయితే అతను బాగానే కోలుకుంటున్నా పరిశీలన నిమిత్తం ఇంకా ఐసీయూలోనే ఉంచినట్టు డాక్టర్లు తెలిపారు. మరోసారి తీసిన సిటీ స్కాన్, ఎంఆర్‌ఐలో కూడా ఆందోళనకరంగా ఏమీ లేదని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సవ్యసాచి సేన్ తెలిపారు. ఇప్పటికిప్పుడు డిశ్చార్జి మాత్రం చేయబోమని స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement