ఇండియన్‌ వెల్స్, మయామి టోర్నీలకు నాదల్‌ దూరం | Rafael Nadal distance from the Indian Wells Tournament and Miami | Sakshi
Sakshi News home page

ఇండియన్‌ వెల్స్, మయామి టోర్నీలకు నాదల్‌ దూరం

Mar 4 2018 4:51 AM | Updated on Mar 4 2018 4:51 AM

Rafael Nadal distance from the Indian Wells Tournament and Miami - Sakshi

ఫ్లోరిడా: తుంటి గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ ఇండియన్‌ వెల్స్, మయామి మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీలకు దూరమయ్యాడు. ‘గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. అందుకే ఇండియన్‌ వెల్స్, మయామి టోర్నమెంట్‌లకు దూరమవుతున్నాను. క్లే కోర్టు సీజన్‌ వరకు తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తా’ అని పేర్కొన్నాడు.  

31 ఏళ్ల నాదల్‌ గతంలో మూడు సార్లు (2007, 2009, 2013) ఇండియన్‌ వెల్స్‌ టైటిల్స్‌ గెలుచుకున్నాడు. ఐదు సార్లు (2005, 2008, 2011, 2014, 2017) మయామి ఫైనల్‌కు చేరాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌ క్వార్టర్స్‌లో ఓడిన అనంతరం నాదల్‌ కోర్టులో అడుగు పెట్టలేదు. మరోవైపు ప్రస్తుతం వరల్డ్‌ నంబర్‌వన్‌గా ఉన్న రోజర్‌ ఫెడరర్‌ తన ర్యాంక్‌ను కాపాడుకోవాలంటే ఇండియన్‌ వెల్స్‌ టోర్నీలో కనీసం సెమీస్‌కు చేరాల్సి ఉంటుంది. లేదంటే నాదల్‌ మళ్లీ నంబర్‌వన్‌ అవుతాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement