అశ్విన్@1 | R Ashwin new number one bowler in Tests; Ajinkya Rahane sixth in batsman’s list | Sakshi
Sakshi News home page

అశ్విన్@1

Oct 12 2016 2:02 PM | Updated on Sep 4 2017 5:00 PM

అశ్విన్@1

అశ్విన్@1

ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మొదటి స్ధానాన్ని దక్కించుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్ సంఘం(ఐసీసీ) టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మొదటి స్ధానాన్ని దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరిస్ లో భీకర బౌలింగ్ తో కివీస్ ను చిత్తు చేసిన అశ్విన్ తాజాగా విడుదలైన టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో 900 పాయింట్లతో తొలిస్ధానాన్ని కైవసం చేసుకున్నాడు.
 
ఇప్పటికే ఐసీసీ టెస్టు ఆల్ రౌండర్లలో జాబితాలో అశ్విన్ టాప్ ర్యాంకులో కొనసాగుతున్న విషయం తెలిసిందే. టెస్టు బౌలర్లు, ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా ఏడు, మూడు స్ధానాల్లో నిలిచాడు. కాగా, టెస్టు బ్యాట్స్ మన్ టాప్ 10 జాబితాలో అజింక్యా రహానే ఒక్కడే ఆరవ స్ధానంలో నిలిచాడు.
టాప్ 10 టెస్టు బౌలర్లు
1.ఆర్.అశ్విన్(భారత్)
2.డేల్ స్టెయిన్(దక్షిణ ఆఫ్రికా)
3.జేమ్స్ అండర్సన్(ఇంగ్లాండ్)
4.ఎస్.సీ.జే బ్రాడ్(ఇంగ్లాండ్)
5.రంగనా హెరాత్(శ్రీలంక)
6.యాసిర్ షా(పాకిస్తాన్)
7.రవీంద్ర జడేజా(భారత్)
8.మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా)
9.ఎన్.వాగ్నెర్(న్యూజిలాండ్)
10.వీ.డీ.ఫిలాండర్(దక్షిణ ఆఫ్రికా)
 
టాప్ 10 టెస్టు ఆల్ రౌండర్లు
1.ఆర్.అశ్విన్(భారత్)
2.షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్)
3.రవీంద్ర జడేజా(భారత్)
4.ఎమ్.ఎమ్ అలీ(ఇంగ్లాండ్)
5.మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా)
6.వీ.డీ ఫిలాండరర్(దక్షిణ ఆఫ్రికా)
7.బీ.ఏ స్టోక్స్(ఇంగ్లాండ్)
8. స్టువర్ట్ బ్రాడ్(ఇంగ్లాండ్)
9.రంగనా హెరాత్(శ్రీలంక)
10.సీఆర్ వోక్స్(ఇంగ్లాండ్)
 
టాప్ 10 టెస్టు బ్యాట్స్ మన్లు
1.ఎస్.పీ.డీ స్మిత్(ఆస్ట్రేలియా)
2.జేఈ రూట్(ఇంగ్లాండ్)
3.హషీమ్ ఆమ్లా(దక్షిణ ఆఫ్రికా)
4.యూనస్ ఖాన్(పాకిస్తాన్)
5.కేన్ విలియమ్ సన్(న్యూజిలాండ్)
6.అజింక్య రహానే(భారత్)
7.ఏ.బి.డివిలియర్స్(దక్షిణ ఆఫ్రికా)
8.ఏ.సి వోగ్స్(ఆస్ట్రేలియా)
9.డీ.ఏ వార్నర్(ఆస్ట్రేలియా)
10.ఏ.ఎన్.కుక్(ఇంగ్లాండ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement