'సఫారీల బౌలింగ్‌ను ఎదుర్కోవడం కష్టం' | the Proteas bowling attack is best in the world, Rohit Sharma | Sakshi
Sakshi News home page

'సఫారీల బౌలింగ్‌ను ఎదుర్కోవడం కష్టం'

Jan 1 2018 4:26 PM | Updated on Jan 1 2018 4:26 PM

the Proteas bowling attack is best in the world, Rohit Sharma - Sakshi

కేప్‌టౌన్‌:సొంతగడ్డపై దక్షిణాఫ్రికా అత్యంత ప‍్రమాదకరమైన జట్టు అనడంలో ఎటువంటి సందేహం లేదని టీమిండియా ఆటగాడు రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. ప్రపంచంలో అత్యుత్తమ బౌలింగ్‌ కల్గిన సఫారీలను ఓడించడం అంత తేలిక కాదన్నాడు. ప్రధానంగా బౌన్సీ వికెట్‌పై దక్షిణాఫ్రికా బౌలర్లను ఎదుర్కోవడం కష్టమని రోహిత్‌ అభిప్రాయపడ్డాడు. జనవరి 5 వ తేదీ నుంచి కేప్‌టౌన్‌లో తొలి టెస్టు ఆరంభం కానున్న నేపథ్యంలో రోహిత్‌ మీడియాతో మాట్లాడాడు.

'మెరుగైన జట్లలో సఫారీ ఒకటి. ప్రపంచ అత్యుత్తమ బౌలింగ్‌ దక్షిణాఫ్రికా సొంతం. సఫారీ గడ్డ మీద స్టెయిన్‌ అండ్‌ కో పేస్‌ బృందాన్ని ఎదుర్కోవడం కచ్చితంగా సవాల్‌తో కూడుకున్నది. సఫారీలపై పైచేయి సాధించాలంటే శ్రమించాల్సి ఉంది. అందుకు టీమిండియా సిద్ధంగా ఉంది' అని రోహిత్‌ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement