ముంబై మహారథి బోణీ | Pro Wrestling League 2017: Mumbai Maharathi record easy win over UP Dangal | Sakshi
Sakshi News home page

ముంబై మహారథి బోణీ

Jan 8 2017 2:00 AM | Updated on Sep 5 2017 12:41 AM

ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌–2లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై మహారథి జట్టు విజయాల బోణీ చేసింది.

న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌–2లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై మహారథి జట్టు విజయాల బోణీ చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 5–2తో యూపీ దంగల్‌పై గెలుపొంది ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. టాస్‌ గెలిచిన యూపీ దంగల్‌ జట్టు 97 కేజీల పురుషుల విభాగాన్ని... ముంబై 53 కేజీల మహిళల విభాగాన్ని బ్లాక్‌ చేశాయి.

ముంబై మహారథి జట్టులో ప్రీతమ్‌ (70 కేజీలు) 3–3తో అమిత్‌ ధన్‌కర్‌పై, ఎరీకా వీబ్‌ (75 కేజీలు) 4–0తో మారియా మమషుక్‌పై, కరోలినా కాస్టిలో (48 కేజీలు) 4–1తో ఎలిట్సా యెంకోవాపై, సరిత (58 కేజీలు) 9–1తో మనీషాపై, హసనోవ్‌ (74 కేజీలు) 3–1తో టారియెల్‌ గప్రిండశ్‌విల్‌పై గెలుపొందారు. యూపీ దంగల్‌ జట్టు తరఫున ఆండ్రీ క్విట్కోవ్‌స్కీ (65 కేజీలు) 4–4తో వికాస్‌ కుమార్‌పై, అమిత్‌ (57 కేజీలు)3–2తో రాహుల్‌ అవారే విజయం సాధించారు. ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఎన్‌సీఆర్‌ పంజాబ్‌ రాయల్స్‌ జట్టు కలర్స్‌ ఢిల్లీ సుల్తాన్స్‌ జట్టుతో తలపడుతుంది.

Advertisement

పోల్

Advertisement