చిక్కుల్లో ప్రవీణ్ తాంబే | Praveen thambe in problems | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో ప్రవీణ్ తాంబే

Aug 6 2015 2:24 AM | Updated on Sep 3 2017 6:50 AM

రాజస్తాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే చిక్కుల్లో పడ్డాడు. అమెరికాలో జరిగిన ఒక అనధికార

రాజస్తాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే చిక్కుల్లో పడ్డాడు. అమెరికాలో జరిగిన ఒక అనధికార టి20 మ్యాచ్‌లో అతను బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ అష్రాఫుల్‌తో కలిసి క్రికెట్ ఆడాడు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసినందుకు అష్రాఫుల్‌పై ప్రస్తుతం నిషేధం ఉంది. ఈ మ్యాచ్ ఆడేందుకు తాంబే ముంబై క్రికెట్ సంఘం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. తనకు ఆ టోర్నమెంట్ గురించి తెలియదని, స్నేహితులతో కలిసి మ్యాచ్ ఆడేందుకు వెళితే అక్కడ అష్రాఫుల్ కూడా ఉన్నాడని తాంబే చెబుతున్నాడు.

Advertisement
Advertisement