ప్రాంజల జంటకు టైటిల్‌ | Pranjala couple win the title | Sakshi
Sakshi News home page

ప్రాంజల జంటకు టైటిల్‌

Dec 9 2017 1:05 AM | Updated on Dec 9 2017 1:05 AM

Pranjala couple win the   title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్‌ విభాగంలో విజేతగా నిలిచింది. షోలాపూర్‌లో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ ప్రాంజల (భారత్‌)–చింగ్‌ వెన్‌ సు (చైనీస్‌ తైపీ) ద్వయం 7–5, 1–6, 10–6తో మయా జాన్సెన్‌ (అమెరికా)–ఎరిన్‌ రౌట్లిఫి (న్యూజిలాండ్‌) జంటపై విజయం సాధించింది.

అంతకుముందు జరిగిన సెమీస్‌లో ప్రాంజల జోడి 6–3, 6–7 (7/9), 10–8తో యెక్సిన్‌ మా (చైనా)–మెక్‌పీ (ఆస్ట్రేలియా) జంటను ఓడించింది.

Advertisement
 
Advertisement
Advertisement