మెయిన్‌ డ్రాకు ప్రణవి, ప్రీతి | pranavi and preethi qualify to main draw | Sakshi
Sakshi News home page

మెయిన్‌ డ్రాకు ప్రణవి, ప్రీతి

Oct 3 2017 10:30 AM | Updated on Oct 3 2017 10:30 AM

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత సీనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారులు కె. ప్రణవి రెడ్డి, కె.ప్రీతి రాణించారు. గుంటూరులో జరుగుతోన్న ఈ టోర్నీ మెయిన్‌డ్రాకు వీరు అర్హత సాధించారు. సోమవారం జరిగిన బాలికల సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌ ఫైనల్‌ రౌండ్‌లో ప్రణవి 15–7, 16–14తో ప్రేరణ నీలూరి (కర్ణాటక)పై గెలుపొందగా... ప్రీతి 15–4, 15–2తో అరువి తిరుమేని (తమిళనాడు)ను ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో ప్రణాలి కరాని (తెలంగాణ)కు వాకోవర్‌ లభించగా, సుప్రియ (తెలంగాణ) 15–6, 15–8తో అనుభా కౌషిక్‌ (ఢిల్లీ)పై, కైవల్య లక్ష్మీ (తెలంగాణ) 15–9, 15–6తో సహనా (తమిళనాడు)పై గెలుపొంది మెయిన్‌డ్రాకు అర్హత సాధించారు.

వీరితో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లీలా లక్ష్మీ, రోషిణి గాయత్రి కూడా ముందంజ వేశారు. లీల 15–10, 15–9తో ఆర్య మోరే (మహారాష్ట్ర)పై, రోషిణి 8–15, 15–4, 15–12తో ఆయుషి సింగ్‌ (హరియాణా)పై గెలుపొందారు. మరోవైపు మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో ఉమాకాంత్‌ సర్గే (మహారాష్ట్ర)–ప్రమద (తెలంగాణ) ద్వయం 10–15, 15–11, 16–14తో ఆకాశ్‌ (యూపీ)–కైలాశ్‌ (ఛత్తీస్‌గఢ్‌) జంటపై, గోపాలకృష్ణ రెడ్డి–ప్రీతి (తెలంగాణ) ద్వయం 9–15, 15–13, 18–16తో మొహమ్మద్‌ రెహాన్‌–అనీస్‌ కౌసర్‌ (తమిళనాడు) జంటపై నెగ్గి మెయిన్‌డ్రాకు చేరుకున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement