మెయిన్‌ ‘డ్రా’కు ప్రజ్నేశ్‌  | Prajnesh Gunneswaran advances to Miami Open main draw | Sakshi
Sakshi News home page

మెయిన్‌ ‘డ్రా’కు ప్రజ్నేశ్‌ 

Mar 22 2019 1:34 AM | Updated on Mar 22 2019 1:34 AM

Prajnesh Gunneswaran advances to Miami Open main draw - Sakshi

మయామి: భారత నంబర్‌వన్‌ సింగిల్స్‌ ప్లేయర్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ మయామి ఓపెన్‌ మాస్టర్స్‌ టెన్నిస్‌ టోర్నీలో మెయిన్‌ డ్రాకు అర్హత సంపాదించాడు. ఇటీవల ఇండియన్‌ వెల్స్‌లోనూ మెయిన్‌ డ్రా చేరిన అతను వారం వ్యవధిలో వరుసగా రెండో మాస్టర్స్‌ టోర్నీలో ఈ ఘనత సాధించాడు. గురువారం జరిగిన రెండో క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో అతను 6–4, 6–4తో బ్రిటన్‌కు చెందిన క్లార్క్‌ను కంగుతినిపించాడు. ఈ వారమే కెరీర్‌ బెస్ట్‌ సింగిల్స్‌ 84వ ర్యాంకుకు ఎగబాకిన ప్రజ్నేశ్‌ వరుస సెట్లలో ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వకుండా చెలరేగాడు. శుక్రవారం జరిగే మెయిన్‌ డ్రా తొలి రౌండ్‌ మ్యాచ్‌లో 29 ఏళ్ల భారత ఆటగాడు జేమ్‌ మునర్‌ (స్పెయిన్‌)తో తలపడతాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement