పీటీ ఉష రికార్డును బద్దలుకొట్టిన వికలాంగుడు!! | Sakshi
Sakshi News home page

పీటీ ఉష రికార్డును బద్దలుకొట్టిన వికలాంగుడు!!

Published Mon, Oct 27 2014 12:41 PM

పీటీ ఉష రికార్డును బద్దలుకొట్టిన వికలాంగుడు!!

వికలాంగుడైన ఓ ఈతగాడు.. దక్షిణకొరియాలోని ఇంచియాన్లో జరుగుతున్న ఏషియన్ పారాగేమ్స్లో చరిత్ర సృష్టించాడు. ఈ క్రీడల్లో శరత్ గైక్వాడ్ ఆరు పతకాలు సాధించాడు. ఇంతకుముందు పీటీ ఉష ఒకే ఈవెంట్లో కేవలం ఐదు పతకాలు మాత్రమే సాధించగా.. ఇప్పుడు దానికంటే ఒకటి ఎక్కువగా.. ఆరు పతకాలు సాధించి రికార్డు కొట్టాడు. 2012లో లండన్లో జరిగిన పారాలింపిక్స్లో కూడా పాల్గొన్న శరత్ గైక్వాడ్.. సరికొత్త రికార్డు సాధించాడు. ఇంతకుముందు పీటీ ఉష 1986 ఆసియా క్రీడల్లో ఒకేసారి ఐదు పతకాలు సాధించారు.

ముందుగా శరత్ గైక్వాడ్ 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో రజత పతకం సాధించాడు. తర్వాత 100 మీటర్ల బటర్ఫ్లై, 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్, 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్, 50 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగాల్లో కాంస్య పతకాలు సాధించాడు. చివరగా తన సహచరులు ప్రశాంత కర్మాకర్, స్వప్నిల్పాటిల్, నిరంజన్ ముకుందన్లతో కలిసి 4x100 మీటర్ల మెడ్లీ రిలేలో కూడా కాంస్య పతకం కొట్టాడు. ఈ క్రీడల్లో తన పెర్ఫార్మెన్సు పట్ల చాలా సంతోషంగా ఉందని, గత ఆరు నెలలుగా ఈ పోటీల కోసం కఠోర శిక్షణ తీసుకున్నానని, దానికి ఇప్పుడు ఫలితం రావడంతో చాలా ఆనందంగా ఉందని శరత్ చెప్పాడు. ఇన్నాళ్లుగా తనకు మద్దతుగా నిలిచిన తల్లిదండ్రులు, కోచ్ జాన్ క్రిస్టోఫర్, జీవో స్పోర్ట్స్ ఫౌండేషన్లకు కృతజ్ఞతలు తెలిపాడు.

Advertisement
Advertisement