మళ్లీ విజృంభిస్తాం: విరాట్ | Our worst batting display in last two years, says Virat Kohli | Sakshi
Sakshi News home page

మళ్లీ విజృంభిస్తాం: విరాట్

Feb 25 2017 5:28 PM | Updated on Sep 5 2017 4:35 AM

మళ్లీ విజృంభిస్తాం: విరాట్

మళ్లీ విజృంభిస్తాం: విరాట్

ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో ఓటమికి చెత్త బ్యాటింగే కారణమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిందించాడు.

పుణె: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో ఓటమికి చెత్త బ్యాటింగే కారణమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిందించాడు. గత రెండేళ్లలో తామాడిన టెస్టుల్లో ఇదే చెత్త బ్యాటింగ్‌ అని అన్నాడు. పుణె టెస్టులో భారత్ 333 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది.

'పుణె మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాం. గత రెండేళ్లలో ఎన్నడూ ఇంత దారుణంగా ఆడలేదు. మ్యాచ్ జరిగిన మూడు రోజుల్లో ఒక్క రోజు కూడా సరిగా ఆడలేదు. ఏం పొరపాటు చేశామో తెలుసుకోవాల్సివుంది. మాకంటే ఆసీస్ ఆటగాళ్లు పరిస్థితులను ఉపయోగించుకున్నారు. మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టి మ్యాచ్‌పై పట్టు సాధించారు. ఈ సిరీస్‌లో మేం పుంజుకుని మళ్లీ విజృంభిస్తాం. మాకు మెరుగైన రికార్డు ఉంది. ప్రేక్షకుల మద్దతు ఉంది' అని మ్యాచ్ అనంతరం విరాట్ అన్నాడు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు బెంగళూరులో జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement