ఒకీఫ్‌పై ఏడాది నిషేధం | O'Keefe banned, fined for drunken incident | Sakshi
Sakshi News home page

ఒకీఫ్‌పై ఏడాది నిషేధం

Apr 8 2017 12:32 AM | Updated on Sep 5 2017 8:11 AM

ఒకీఫ్‌పై ఏడాది నిషేధం

ఒకీఫ్‌పై ఏడాది నిషేధం

భారత్‌తో టెస్టు సిరీస్‌లో చెలరేగి ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న ఆస్ట్రేలియా లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ స్టీవ్‌ ఒకీఫ్‌ వ్యక్తిగత ప్రవర్తనతో ఇబ్బందుల్లో పడ్డాడు.

మత్తులో మాట తూలడమే కారణం   

సిడ్నీ: భారత్‌తో టెస్టు సిరీస్‌లో చెలరేగి ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న ఆస్ట్రేలియా లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ స్టీవ్‌ ఒకీఫ్‌ వ్యక్తిగత ప్రవర్తనతో ఇబ్బందుల్లో పడ్డాడు. మద్యం మత్తులో తీవ్ర అభ్యంతరక వ్యాఖ్యలు చేయడంతో అతనిపై క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) చర్య తీసుకుంది. ఏడాది పాటు దేశవాళీ వన్డే టోర్నీల్లో పాల్గొనకుండా నిషేధించడంతో పాటు 20 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్ల (రూ. 9 లక్షల 66 వేలు) జరిమానా విధించింది.

ఇటీవల ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్టీవ్‌ వా మెడల్‌ ప్రదానోత్సవం తర్వాత జరిగిన పార్టీలో ఒకీఫ్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘న్యూసౌత్‌వేల్స్‌ అధికారిక కార్యక్రమంలో నేను చాలా ఎక్కువగా తాగి తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశాను. నా తప్పును అంగీకరించి క్షమాపణ కోరుతున్నాను. నాపై విధించిన శిక్షను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. మున్ముందు ఈ విషయంలో ప్రత్యేక కౌన్సిలింగ్‌ కూడా తీసుకోబోతున్నాను’ అని ఒకీఫ్‌ వివరణ ఇచ్చాడు. 32 ఏళ్ల ఒకీఫ్‌ భారత్‌లో జరిగిన నాలుగు టెస్టుల్లో 19 వికెట్లు పడగొట్టాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement