ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ అబాట్కు ఆ జట్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్ పూర్తి మద్దతు ప్రకటించాడు.
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ అబాట్కు ఆ జట్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్ పూర్తి మద్దతు ప్రకటించాడు. ఫిలిప్ హ్యూస్ విషాద మరణం ఘటనలో అబాట్ను ఎవరూ నిందించడం లేదని, అందులో అతని తప్పు లేనేలేదని క్లార్క్ అన్నాడు. ఆసీస్ క్రికెట్ జట్టు అబాట్కు అండగా ఉంటుందని చెప్పాడు.
దేశవాళీ మ్యాచ్లో అబాట్ వేసిన బౌన్సర్ తలకు తగిలి యువ బ్యాట్స్మన్ ఫిలిప్ హ్యూస్ మరణించిన సంగతి తెలిసిందే. దీంతో షాక్కు గురైన అబాట్కు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. హ్యూస్ సోదరి కూడా అబాట్ను కలసి ఓదార్చారు.