‘రంగు’ మారుతోంది | No more Whistle Podu? Dhoni set to leave CSK for new team in IPL | Sakshi
Sakshi News home page

‘రంగు’ మారుతోంది

Oct 25 2015 1:57 AM | Updated on Sep 3 2017 11:25 AM

‘రంగు’ మారుతోంది

‘రంగు’ మారుతోంది

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోని. తొలి సీజన్ 2008 నుంచి ఇప్పటి వరకూ ధోని ఇదే జట్టుకు సారథ్యం వహించాడు.

చెన్నై: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోని. తొలి సీజన్ 2008 నుంచి ఇప్పటి వరకూ ధోని ఇదే జట్టుకు సారథ్యం వహించాడు. ప్రతి ఏటా పసుపు రంగు దుస్తుల్లో చెన్నై జట్టును నడిపిస్తూ కనిపించే ధోని... వచ్చే సీజన్‌లో కొత్త జట్టుకు ఆడబోతున్నాడు. రాబోయే రెండు సీజన్లకు చెన్నై, రాజస్తాన్ జట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండేళ్లు ధోని కూడా లీగ్‌కు దూరంగా ఉంటాడనే పుకారు ఆ మధ్య వినిపించింది. అయితే కొత్తగా వచ్చే రెండు జట్లలో ఏదో ఒక జట్టు తరఫున ధోని ఆడతాడని, రెండేళ్ల తర్వాత తిరిగి చెన్నై జట్టుకు వెళతాడని అతని సన్నిహితుడు ఒకరు వెల్లడించారు. ఐపీఎల్ విషయంలో మహి భవిష్యత్తు గురించి శ్రీనివాసన్‌తో చర్చించాడని కూడా అతను అం టున్నారు. మరి ధోని ఈ సారి ఏ రంగు దుస్తుల్లో ఏ జట్టు తరఫున బరిలోకి దిగుతాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement