క్వార్టర్ ఫైనల్లో నిధి, రిషిక | nidhi,rishika entered in quarter finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్ ఫైనల్లో నిధి, రిషిక

Apr 10 2014 12:15 AM | Updated on Sep 2 2017 5:48 AM

క్వార్టర్ ఫైనల్లో నిధి, రిషిక

క్వార్టర్ ఫైనల్లో నిధి, రిషిక

అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నీలో సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నిధి చిలుముల క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది.

ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీ
 చెన్నై: అంతర్జాతీయ టె న్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నీలో సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నిధి చిలుముల క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. ఇక్కడి మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో బుధవారం మెయిన్ డ్రా రెండో రౌండ్‌లో ఏడో సీడ్ నిధి 7-5, 4-6, 6-1తో మన రాష్ట్రానికే చెందిన యడ్లపల్లి ప్రాంజలపై విజయం సాధించింది.
 
  తొలి సెట్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ నిధి గెలుపు దక్కించుకుంది. అయితే రెండో సెట్‌లో ప్రాంజల దూకుడును కట్టడి చేయలేకపోవడంతో నిధి ఓటమి చవిచూసింది. కాసేపటికే కోలుకున్న నిధి తిరిగి మూడో సెట్‌లో తన సత్తా చాటింది. మరో వైపు స్నేహ పడమట 2-6, 1-6తో హిరోనో వతనబే (జపాన్) చేతిలో పరాజయం పాలైంది. మరో మ్యాచ్‌లో తెలుగు అమ్మాయి రిషిక  సుంకర 6-7 (0/7), 6-4, 6-4తో శ్వేత శ్రీహరిపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
 
 డబుల్స్ విభాగంలో చైనాకు చెందిన జియావో వాంగ్‌తో కలసి బరిలోకి దిగిన నిధి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్‌ఫైనల్లో నిధి-వాంగ్ జోడి 6-0, 6-2తో ప్రీతి (భారత్)-సాయ్‌కాయ్ (జపాన్)పై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో రిషిక-శర్మద జోడి 6-1, 6-1తో నిత్యారాజ్-రోహీరా (భారత్) జోడిపై నెగ్గి సెమీస్‌లో అడుగుపెట్టింది. గురువారం జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో నిధి జోడి, నటాషా-ప్రార్థన (భారత్) జోడితో తలపడనుంది. మరో మ్యాచ్‌లో నటాషా-ప్రార్థన ద్వయం 6-3, 6-2తో స్నేహ పడమట-వానియా జోడిపై గెలిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement