మెకల్లమ్ ఫేర్ వెల్ మ్యాచ్; ఓటమి దిశగా కివీస్ | new zealand set target 201 target for australia | Sakshi
Sakshi News home page

మెకల్లమ్ ఫేర్ వెల్ మ్యాచ్; ఓటమి దిశగా కివీస్

Feb 23 2016 10:48 AM | Updated on Sep 3 2017 6:15 PM

మెకల్లమ్ ఫేర్ వెల్ మ్యాచ్; ఓటమి దిశగా కివీస్

మెకల్లమ్ ఫేర్ వెల్ మ్యాచ్; ఓటమి దిశగా కివీస్

న్యూజిలాండ్ డాషింగ్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్ ఫేర్ వెల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓటమి దిశగా పయనిస్తోంది.

క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ డాషింగ్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్ ఫేర్ వెల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓటమి దిశగా పయనిస్తోంది. ఆస్టేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో కివీస్ పరాజయం దాదాపుగా ఖాయమైంది. 121/4 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన కివీస్ 335 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా ముందు 201 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

విలియమ్సన్(97) తృటిలో సెంచరీ కోల్పోయాడు. హెన్రీ(66) అర్ధ సెంచరీ సాధించాడు. ఆండర్సన్ 40, వాట్లింగ్ 46 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో బర్డ్ 5, పాటిస్సన్ 4 వికెట్లు పడగొట్టారు. హాజిల్ వుడ్ ఒక వికెట్ తీశాడు.

టార్గెట్ ను చేరుకునేందుకు బరిలోకి దిగిన ఆసీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 70 పరుగులు చేసింది. వార్నర్(22) అవుటయ్యాడు. బర్న్స్(27), ఖాజా(19) క్రీజ్ లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement