‘ధోని ప్రాముఖ్యతను తగ్గించవద్దు’

Never Underestimate Importance Of MS Dhoni, Michael Clarke - Sakshi

మెల్‌బోర్న్‌:  టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ప్రాముఖ్యతను తక్కువ చేయొద్దని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ స్పష్టం చేశాడు. ఇటీవల కాలంలో ధోని జట్టులో కొనసాగడంపై పలువురు విమర్శలు ఎక్కు పెట్టిన నేపథ్యంలో క్లార్క్‌ స్పందించాడు. ధోనిపై విమర్శలు చేసి అతని ప్రాధాన్యతను తగ్గించడం తగదన్నాడు.  పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్‌కు అతడి అవసరం ఎంతైనా ఉందన్నాడు.
(ఇక్కడ చదవండి:కోహ్లి.. వీటికి సమాధానం ఏది?)

‘ఎంఎస్‌ ధోనిని తక్కువ అంచనా వేయకండి. మధ్య ఓవర్లలో అతడి అనుభవం అత్యంత కీలకం. త్వరలో వన్డే వరల్డ్‌కప్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో ధోని ప్రాధాన‍్యతను తగ్గిస్తూ విమర్శలు చేయడం శ్రేయస్కరం కాదు’ అని క్లార్క్‌ పేర్కొన్నాడు. భారత్‌కు రెండుసార్లు వరల్డ్‌కప్‌ సాధించిన ఘనత ధోనిది. 2007లో టీ20 వరల్డ్‌కప్‌ను భారత జట్టు ధోని కెప్టెన‍్సీలో గెలవగా, 2011 వన్డే వరల్డ్‌కప్‌ కూడా ధోని సారథ్యంలోనే వచ్చింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top