
రోహిత్ సేన ఫీల్డింగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచి రోహిత్ శర్మ తొలుత కోల్ కతాను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ లో గెలిచి టోర్నీలో బోణి కొట్టాలని ముంబై ఇండియన్స్ ఆరాట పడుతోంది. రైజింగ్ పుణె తో జరిగిన గత మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మరొకవైపు గుజరాత్ లయన్స్ పై ఘన విజయంతో మంచి ఊపు మీద ఉన్న కోల్ కతా మరో గెలుపు కోసం ఉవ్విళ్లూరుతోంది.
కోల్ కతా తుది జట్టు: గౌతం గంభీర్(కెప్టెన్), క్రిస్ లిన్, రాబిన్ ఊతప్ప, మనీష్ పాండే, యూసఫ్ పఠాన్, సూర్య కుమార్ యాదవ్, క్రిస్ వోక్స్, కుల్దీప్ యాదవ్,రాజ్ పుత్,సునీల్ నరైన్, ట్రెంట్ బౌల్ట్
ముంబై ఇండియన్స్ తుది జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), పార్దీవ్ పటేల్, జాస్ బట్లర్, నితిష్ రానా, కృణాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా,పొలార్డ్, హర్భజన్ సింగ్, మెక్లీన్ గన్, లతిష్ మలింగా, బూమ్రా