ఇంగ్లండ్ను తిప్పేశారు | Mehedi Hasan takes six wickets to control england first innigs lead | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ను తిప్పేశారు

Oct 29 2016 2:13 PM | Updated on Sep 4 2017 6:41 PM

ఇంగ్లండ్ను తిప్పేశారు

ఇంగ్లండ్ను తిప్పేశారు

బంగ్లాదేశ్-ఇంగ్లండ్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది.

మిర్పూర్: బంగ్లాదేశ్-ఇంగ్లండ్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. బంగ్లాదేశ్ను తొలి ఇన్నింగ్స్లో  220 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లండ్.. తన మొదటి ఇన్నింగ్స్లో  244 పరుగులకే  పరిమితమైంది. 50/3 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయి ఆశించిన స్కోరును బోర్డుపై ఉంచలేకపోయింది. బంగ్లాదేశ్ స్పిన్నర్లు మొహిది హసన్ మిరాజ్ ఆరు వికెట్లతో ఇంగ్లండ్ వెన్నువిరచగా, తైజుల్ ఇస్లామ్ మూడు వికెట్లు సాధించాడు. మరో స్పిన్నర్ షకిబుల్ హసన్కు ఒక వికెట్ దక్కింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో జో రూట్(56) హాఫ్ సెంచరీతో రాణించగా,చివర్లో వోక్స్(46), రషిద్(44 నాటౌట్)లు ఆకట్టుకోవడంతో ఇంగ్లండ్ రెండొందల మార్కును దాటింది.

హసన్ మిరాజ్ అరుదైన ఘనత

బంగ్లాదేశ్ స్పిన్నర్ హసన్ మిరాజ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. తన వరుస టెస్టుల్లో ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన తొలి బంగ్లాదేశ్ ఆఫ్ స్పిన్నర్ గా నిలిచాడు. ఓవరాల్గా ఈ ఘనతను అందుకున్న రెండో ఆఫ్ స్పిన్నర్. అంతకుముందు వెస్టిండీస్ ఆఫ్ స్పిన్నర్ తొలి రెండు టెస్టుల్లో ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లను తీసిన ఘనతను సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement