రియో జట్టులో షరపోవా! | Maria Sharapova named in Russia’s Olympic team despite doping ban | Sakshi
Sakshi News home page

రియో జట్టులో షరపోవా!

May 27 2016 6:11 PM | Updated on Sep 4 2017 1:04 AM

రియో జట్టులో షరపోవా!

రియో జట్టులో షరపోవా!

డోపింగ్ వల్ల సస్పెన్షన్‌కు గురైన రష్యా స్టార్ ప్లేయర్ మరియా షరపోవా పేరును రష్యా టెన్నిస్ ఫెడరేషన్ (ఆర్‌టీఎఫ్) రియో ఒలింపిక్స్‌కు నామినేట్ చేసింది.

మాస్కో: డోపింగ్ వల్ల సస్పెన్షన్‌కు గురైన రష్యా స్టార్ ప్లేయర్ మరియా షరపోవా పేరును రష్యా టెన్నిస్ ఫెడరేషన్ (ఆర్‌టీఎఫ్) రియో ఒలింపిక్స్‌కు నామినేట్ చేసింది. ఈ మేరకు గురువారం విడుదల చేసిన మహిళల సింగిల్స్ జాబితాలో స్వెత్లానా కుజనెత్సోవా, అనస్థాషియా పవ్‌లిన్‌చుకోవా, డర్యా కసాట్కినాతో పాటుగా షరపోవాను చేర్చింది. కానీ రియోలో  షరపోవా ప్రాతినిధ్యంపై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) నుంచి ఇంకా అనుమతి రాలేదు.

నిషేధిత ఉత్ప్రేరకం మాల్డోనియంను ఉపమోగించినందున మార్చి 12 నుంచి షరపోవాపై నిషేధం కొనసాగుతోంది. నిబంధనల ప్రకారం అనుమతి లభించకపోతే షరపోవా స్థానంలో... ఎకటేరియన్ మస్కిమోవా ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది.     

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement