కుంబ్లే మద్దతు వల్లే సాధ్యమైంది | Kumble has been possible because of the support | Sakshi
Sakshi News home page

కుంబ్లే మద్దతు వల్లే సాధ్యమైంది

Nov 4 2016 12:07 AM | Updated on Sep 4 2017 7:05 PM

కుంబ్లే మద్దతు వల్లే   సాధ్యమైంది

కుంబ్లే మద్దతు వల్లే సాధ్యమైంది

అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్)కి భారత జట్టు కోచ్ అనిల్ కుంబ్లే మద్దతివ్వడంతోనే ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో

డీఆర్‌ఎస్‌పై ఐసీసీ జీఎం 

న్యూఢిల్లీ: అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్)కి భారత జట్టు కోచ్ అనిల్ కుంబ్లే మద్దతివ్వడంతోనే ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో అమలవుతోందని ఐసీసీ జనరల్ మేనేజర్ జెఫ్ అల్లార్డిస్ తెలిపారు. ఆధునీకరించిన డీఆర్‌ఎస్‌కు ఆయన మద్దతు చాలా కీలకంగా మారిందని అన్నారు.

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ హోదాలో డీఆర్‌ఎస్ మార్పులను గమనించేందుకు ఎంఐటీకి వెళ్లిన కుంబ్లే బీసీసీఐ కూడా అంగీకరించేలా చేశారు. దీంతో ఇంగ్లండ్   తో జరిగే టెస్టు సిరీస్‌కు ప్రయోగాత్మకంగా డీఆర్‌ఎస్‌ను అమలు చేయనున్నారు. గత నాలుగేళ్లుగా కుంబ్లే ప్రికమిటీలో సభ్యుడిగా ఉన్నారని, డీఆర్‌ఎస్ మెరుగుదలకు సంబంధించిన అన్ని విషయాలు ఆయనకు తెలుసునని అల్లార్డిస్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement