శ్యామ్, హుస్సాముద్దీన్‌లకు కాంస్యాలు | Kakara Shyam and Mohammad Hussamuddin get Bronze medals | Sakshi
Sakshi News home page

శ్యామ్, హుస్సాముద్దీన్‌లకు కాంస్యాలు

Jun 25 2017 1:17 AM | Updated on Sep 5 2017 2:22 PM

ఉలాన్‌బాటర్‌ కప్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్‌ బాక్సర్‌ కాకర శ్యామ్‌ కుమార్, తెలంగాణకు

న్యూఢిల్లీ: ఉలాన్‌బాటర్‌ కప్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్‌ బాక్సర్‌ కాకర శ్యామ్‌ కుమార్, తెలంగాణకు చెందిన మొహమ్మద్‌ హుస్సాముద్దీన్‌ కాంస్య పతకాలను సాధించారు. మంగోలియాలో జరుగుతోన్న ఈ టోర్నీ సెమీస్‌లో వీరిద్దరూ ఓడిపోవడంతో కాంస్యాలతో వెనుదిరగాల్సి వచ్చింది.

సెమీఫైనల్‌ బౌట్‌లో శ్యామ్‌ కుమార్‌ (49 కేజీలు) రోజెన్‌ లాడోన్‌ చేతిలో...హుస్సాముద్దీన్‌ (56 కేజీలు) మంగోలియాకు చెందిన తుముర్ఖుయాగ్‌ చేతిలో ఓడిపోయారు. భారత్‌కే చెందిన దేవేంద్రో సింగ్‌ (52 కేజీలు), అంకుశ్‌ దహియా (60 కేజీలు) ఫైనల్‌కు చేరుకున్నారు. సెమీస్‌లో గండులమ్‌ మంగన్‌ ఎర్డెన్‌ (మంగోలియా)పై దేవేంద్రో, సిబికోవ్‌ (రష్యా)పై అంకుశ్‌ గెలిచారు. మహిళల విభాగంలో ప్రియాంక (60 కేజీలు) సెమీస్‌లో హి సంగ్‌ చో (కొరియా) చేతిలో ఓడిపోయి కాంస్యంతో సరిపెట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement