బెల్జియం చేతిలో భారత్ పరాజయం | Indias defeat at the hands of Belgium | Sakshi
Sakshi News home page

బెల్జియం చేతిలో భారత్ పరాజయం

Jun 15 2015 1:59 AM | Updated on Sep 3 2017 3:45 AM

వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్ సన్నాహాల్లో భాగంగా భారత జట్టుకు తమ రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది.

యాంట్‌వర్ప్ (బెల్జియం) : వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్ సన్నాహాల్లో భాగంగా భారత జట్టుకు తమ రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. బెల్జియంతో జరిగిన ఈ మ్యాచ్‌లో సర్దార్ సింగ్ సేన 1-2 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ 32వ నిమిషంలో ఏకైక గోల్ చేశాడు. 16న తమ చివరి ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు యూఎస్‌ఏతో తలపడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement