భారత మహిళల క్రికెట్‌ కోచ్‌ తుషార్‌ రాజీనామా  

Indian womens cricket coach Tushar resigned - Sakshi

న్యూఢిల్లీ: అప్పుడు పురుషుల జట్టు కోచ్‌ అనిల్‌ కుంబ్లే... ఇప్పుడేమో భారత మహిళల క్రికెట్‌ జట్టు కోచ్‌ తుషార్‌ అరోతె... జట్టు సభ్యులను నొప్పించలేక తప్పుకున్నారు. మంగళవారం తుషార్‌ తన పదవికి రాజీనామా చేశారు. సీనియర్‌ మహిళా క్రికెటర్లతో విబేధాలే ఆయన దిగిపోవడానికి కారణమని తెలిసింది. తుషార్‌ శిక్షణపై స్టార్‌ క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు, కోచ్‌ను తప్పించాల్సిందేనని పట్టుబట్టడంతో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తుషార్‌తో రాజీనామా చేయించింది.

‘వ్యక్తిగత కారణాలతో కోచ్‌ పదవి నుంచి తుషార్‌ తప్పుకున్నారు. ఈ అవకాశమిచ్చిన బోర్డుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. తుషార్‌ కోచింగ్‌లోనే గతేడాది ఇంగ్లండ్‌ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్‌లో మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనలోనూ వన్డే, టి20 సిరీస్‌లను గెలిచింది. అయితే ఆసియా కప్‌ టి20 ఫైనల్లో బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిన తర్వాత క్రికెటర్లకు కోచ్‌కు మధ్య విబేధాలు పొడసూపాయి. ఇవి తారాస్థాయికి చేరడంతో కోచ్‌ను రాజీనామాతో తప్పించారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top