టీమిండియా లక్ష్యం 244 | India Set Target of 244 Runs Against New Zealand | Sakshi
Sakshi News home page

టీమిండియా లక్ష్యం 244

Jan 28 2019 11:21 AM | Updated on Jan 28 2019 12:33 PM

India Set Target of 244 Runs Against New Zealand - Sakshi

మౌంట్‌ మాంగనీ: భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్‌ 244 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాస్‌ టేలర్‌(93;106 బంతుల్లో 9 ఫోర్లు), టామ్‌ లాథమ్‌(51; 64 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్సర్‌) ఆకట్టుకోవడంతో న్యూజిలాండ్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న కివీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మున్రో(7) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, ఆపై కాసేపటికి గప్టిల్‌(13) కూడా ఔటయ్యాడు. దాంతో 26 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కివీస్‌ కోల్పోయింది. ఆ తరుణంలో కేన్‌ విలియమ్సన్‌-రాస్‌ టేలర్‌ జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 33 పరుగులు జత చేసిన తర్వాత విలియమ్సన్‌(28) పెవిలియన్‌ బాట పట్టాడు.

అటు తర్వాత టేలర్‌-లాథమ్‌లు స్కోరు బోర్డును చక్కదిద్దారు. ఈ జంట 119 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో కివీస్‌ తేరుకుంది. ఈ క్రమంలోనే ముందుగా టేలర్‌ హాఫ్‌ సెంచరీ చేయగా, లాథమ్‌ కూడా అర్థ శతకంతో మెరిశాడు.  హాఫ్‌ సెంచరీ సాధించిన లాథమ్‌ స్కోరును పెంచే క్రమంలో ఔటయ‍్యాడు. కాసేపటికి హెన్రీ నికోలస్‌, సాంత్నార్‌లు ఔటయ్యారు. దాంతో కివీస్‌ 20 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లను చేజార‍్చుకుంది. ఒకవైపు వికెట్లు పడుతుండటంతో స్కోరును పెంచే  బాధ్యత టేలర్‌పై పడింది. కాగా, టేలర్‌ ఏడో వికెట్‌గా ఔటయ్యాడు. మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో దినేశ్‌ కార్తీక్‌కు క్యాచ్‌ ఇచ్చిన టేలర్‌ సెంచరీ సాధించే అవకాశాన్ని మిస్‌ చేసుకున్నాడు. అనంతరం కివీస్‌ ఆటగాళ్లు వరుస పెట్టి క్యూకట్టడంతో ఆ జట్టు 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది.  భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ మూడు వికెట్లు సాధించగా, హార్దిక్‌ పాండ్యా, చహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌లు తలో రెండు వికెట్లు తీశారు. (వారెవ్వా పాండ్యా.. వాటే క్యాచ్‌!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement