దక్షిణాఫ్రికా ఆలౌట్‌

India restrict South Africa to 335 - Sakshi

సెంచూరియన్‌: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 335 పరుగుల వద్ద ఆలౌటైంది. 269/6 ఓవర్‌ నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సఫారీలు.. మరో 66  పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లను నష్టపోయింది. ఈ రోజు ఆటలో ఓవర్‌నైట్‌ ఆటగాడు మహరాజ్‌(18) ఆదిలోనే పెవిలియన్‌కు చేరాడు. మొహ్మద్‌ షమీ బౌలింగ్‌లో మహరాజ్‌ అవుటయ్యాడు. ఆపై రబడా- డు ప్లెసిస్‌ జోడి కాసేపు భారత బౌలింగ్‌ను ప్రతిఘటించింది.

ఈ జోడి 42 పరుగులు జత చేసిన తర్వాత రబడా(11) ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో రబడా ఇచ్చిన క్యాచ్‌ను హార్దిక్‌ పాండ్యా అద్బుతంగా పట్టుకున్నాడు. ఫార్వర్డ్‌ లెగ్‌ నుంచి డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ వైపు పరుగెత్తుకుంటూ వచ్చిన పాండ్యా క్యాచ్‌ను డైవ్‌ కొట్టి పట్టుకున్నాడు. అటు తరువాత డు ప్లెసిస్‌(63)ను ఇషాంత్‌ శర్మ బౌల్డ్‌ చేశాడు. ఇక చివరి వికెట్‌గా మోర్కెల్‌(6) పెవిలియన్‌ చేరాడు. రవి చంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో మురళీ విజయ్‌కు క్యాచ్‌ ఇచ్చి మోర్కెల్‌ అవుటయ్యాడు.  అశ్విన్‌ నాలుగు వికెట్లు సాధించగా, ఇషాంత్‌ శర్మ మూడు వికెట్లు తీశాడు. షమీకి వికెట్‌ దక్కింది.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top