10 పరుగులకే ఓపెనర్లు ప్యాకప్‌!

India Openers Packup at Lords Test Against England - Sakshi

మళ్లీ వర్షం అంతరాయం.. నిలిచి పోయిన ఆట

లార్డ్స్‌ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులోను భారత తడబాటు కొనసాగుతోంది. 10 పరుగులకే ఓపెనర్లిద్దరూ చాపచుట్టేశారు. తొలి ఓవర్‌లోనే పరుగుల ఖాతా తెరవకుండా ఓపెనర్‌ మురళీ విజయ్‌ డకౌట్‌ కాగా.. ఆరో ఓవర్‌ తొలి బంతికి మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ క్యాచ్‌ ఔట్‌గా నిష్క్రమించాడు. ఈ రెండు వికెట్లు అండర్సనే పడగొట్టడం విశేషం. అనంతరం క్రీజులోకి కెప్టెన్‌ కోహ్లితో పుజారా పోరాడుతున్నాడు. అయితే మ్యాచ్‌కు మళ్లీ వర్షం అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపేశారు.

ఇక తొలి టెస్టులోనూ కెప్టెన్‌ కోహ్లి మినహా మిగతా బ్యాట్స్‌మన్‌ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. దీంతో భారత్‌ 31 పరుగులతో తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. రెండో టెస్ట్‌లోను అదే సీన్‌ రీపిట్‌ అయింది. మళ్లీ కెప్టెన్‌ కోహ్లిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top