టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ | India have won the toss and will bat | Sakshi
Sakshi News home page

టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్

Sep 22 2016 9:21 AM | Updated on Sep 4 2017 2:32 PM

టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్

టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్

న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది.

కాన్పూర్: న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ కు వేదికైన గ్రీన్‌పార్క్ మైదానం బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. భారత్ 500వ టెస్టుకు టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరిస్తానని ఊహించలేదని టాస్ సందర్భంగా కోహ్లి అన్నాడు. ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు.

ఆరుగురు బ్యాట్స్ మన్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నామని వెల్లడించాడు. వృద్ధిమాన్ సాహా వికెట్ కీపింగ్ చేయనున్నాడు. రహానే, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, పుజారా, మురళీ విజయ్, రవీంద్ర జడేజా, అశ్విన్ జట్టులో ఉన్నారు. తాము కూడా దీటుగానే సన్నద్దమయ్యామని కివీస్ కెప్టెన్ విలియమ్సన్ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement