టీ 20ల్లో భారత్ తొలిసారి..
జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. టీ 20 సిరీస్ ఆదిలోనే 'చెత్త' రికార్డును మూటగట్టుకుంది.
హరారే:జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. టీ 20 సిరీస్ ఆదిలోనే 'చెత్త' రికార్డును మూటగట్టుకుంది. టీ 20ల్లో మొదటి బంతికే వికెట్ ను కోల్పోయిన అప్రథను భారత్ తొలిసారి మూటగట్టుకుంది. మూడు టీ 20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ లో 171 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే ఓపెనర్ కేఎల్ రాహుల్(0) వికెట్ ను నష్టపోయింది.
ఇలా ఓ ఆటగాడు తొలి బంతికే నిష్క్రమిండం భారత టీ 20 చరిత్రలో ఇదే తొలిసారి. జింబాబ్వేతో వన్డే సిరీస్ ద్వారా అరంగేట్రం మ్యాచ్ లోనే భారత తరపున శతకం చేసిన ఓపెనర్ గా, బ్యాట్స్మన్ గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్న కేఎల్ రాహుల్.. టీ 20 అరంగేట్రంలో మాత్రం డకౌట్ గా వెనుదిరగడం గమనార్హం.


