అఫ్ఘానిస్థాన్‌పై భారత్ సునాయాస గెలుపు | India beat Afghanistan by eight wickets in Asia Cup | Sakshi
Sakshi News home page

అఫ్ఘానిస్థాన్‌పై భారత్ సునాయాస గెలుపు

Mar 5 2014 8:27 PM | Updated on Mar 28 2019 6:10 PM

అఫ్ఘానిస్థాన్‌పై భారత్ సునాయాస గెలుపు - Sakshi

అఫ్ఘానిస్థాన్‌పై భారత్ సునాయాస గెలుపు

ఆసియాకప్లో భాగంగా అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మిర్పూర్: ఆసియాకప్లో భాగంగా అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అఫ్ఘానిస్థాన్‌ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 32.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్(60), అజింక్య రహానే(56) అర్థ సెంచరీలతో విజయానికి బాటలు వేశారు. రోహిత్ శర్మ 18, దినేష్ కార్తీక్ 21 పరుగులతో నాటౌట్గా నిలిచారు.

టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్‌ 45.2 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటయింది. అఫ్ఘాన్ ఆటగాళ్లలో షెన్వారీ 50, నూర్ అలీ జాడ్రాన్ 31, షహజాద్ 22 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లు ఒక అంకె స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో జడేజా 4, అశ్విన్ 3, మహ్మద్ షమీ 2 వికెట్లు పడొట్టారు. అమిత్ మిశ్రా ఒక వికెట్ దక్కించుకున్నాడు. జడేజా 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement