
రహానే(ఫైల్‌ఫొటో)
కేప్‌టౌన్: మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా కేప్‌టౌన్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఆటగాడు అజింక్యా రహానేను రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేయడం చాలా కఠినమైన నిర్ణయమని దక్షిణాఫ్రికా మాజీ పేసర్ అలెన్ డొనాల్డ్ పేర్కొన్నాడు. తొలి టెస్టు మ్యాచ్‌లో రహానే తుది జట్టులో లేకపోవడంతో తమ ఆటగాళ్లు కచ్చితంగా ఆశ్చర్యానికి లోనై ఉంటారన్నాడు. అదే సమయంలో ఎంతో సంతోషించి ఉంటారనడంలో కూడా ఎటువంటి సందేహం లేదని డొనాల్డ్ స్పష్టం చేశాడు.
' రహానేను తొలి టెస్టుకు దూరంగా ఉంచడం కఠిన నిర్ణయమే. చివరిసారిగా ఇక్కడ పర్యటించినప్పుడు అతడు గొప్పగా రాణించాడు. నా దృష్టిలో, జట్టును స్థిరంగా నడిపించేవాళ్లలో రహానే ఒకడు. అతనొక నమ్మకమైన, బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించే ఆటగాడు. రహానెను రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేసి తమ ఆటగాళ్ల కోసం డ్రింక్స్ తీసుకురావడం చూసి సఫారీ ఆటగాళ్లు ఆశ్చర్యపోయి ఉంటారు. వాళ్లు మాత్రమే కాదు మీరు కూడా అలానే వూహించి ఉంటారు. అతడు అంతర్జాతీయస్థాయి బ్యాట్స్‌మన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు' అని డొనాల్డ్ పేర్కొన్నాడు. మరొకవైపు ఓపెనర్‌గా శిఖర్ ధావన్ సేవలు కూడా ఎంతో అవసరమని డొనాల్డ్ ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నాడు. అతనొక దూకుడుగా ఆడే ఆటగాడని, మ్యాచ్‌ను ఆదిలోనే తమవైపు తిప్పుకునే సత్తా ధావన్‌లో ఉందన్నాడు.