నాకంటూ ప్రత్యేకత ఏమీ లేదు: హార్దిక్‌ | I dont have any one particular role, Hardik Pandya | Sakshi
Sakshi News home page

నాకంటూ ప్రత్యేకత ఏమీ లేదు: హార్దిక్‌

Aug 13 2018 11:43 AM | Updated on Aug 13 2018 11:45 AM

I dont have any one particular role, Hardik Pandya - Sakshi

తాను ప్రత్యేకంగా ఒకటే పని చేయాలని అనుకోనని, పరిస్థితులు తగ్గట్లుగా మారతానని అంటున్నాడు టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా.

లండన్‌: తాను ప్రత్యేకంగా ఒకటే పని చేయాలని అనుకోనని, పరిస్థితులు తగ్గట్లుగా మారతానని అంటున్నాడు టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా. పరుగులు చేసేటప్పుడు బ్యాట్స్‌మన్‌లా, బంతులు విసిరేటప్పుడు బౌలర్‌గా ఆలోచిస్తానని హార్దిక్‌ పాండ్యా స్పష్టం చేశాడు. తనను బ్యాటింగ్‌ ఆల్‌రౌండరా? బౌలింగ్‌ ఆల్‌రౌండరా? అని మీడియా వేసిన ప్రశ్నకు పాండ్యా తనదైన శైలిలో స్పందించాడు.

'నేను బ్యాటింగ్‌ చేసేటప్పుడు బ్యాట్స్‌మన్‌లా ఆలోచిస్తా. బౌలింగ్‌ చేస్తుంటే బౌలర్‌గా ఆలోచిస్తా. నాకంటూ ఒక కచ్చితమైన పాత్ర లేదు. నేను బంతులు విసిరేటప్పుడు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ పొరపాట్లు చేసేలా కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో ఒత్తిడి చేస్తా. ఇంకే ప్రయత్నమూ చేయను. ఒత్తిడి అనువించేలా బౌలింగ్‌ చేసి అవతలి వారు ఎలా స్పందిస్తున్నారో చూస్తా. ప్రత్యర్థి భారీ షాట్లు ఆడాలనే ప్రయత్నిస్తారు. అలాంటప్పుడే వారు పొరపాట్లు చేస్తారు' అని హార్దిక్‌ పాండ్యా అన్నాడు.

క్రికెట్‌లో అదృష్టం గురించి ఆధారపడనని పాండ్యా అన్నాడు. మైదానంలో జరిగేదంతా కష్టానికి తగిన ఫలితమే పేర్కొన్నాడు. మూడో రోజు భోజన విరామం తర్వాత పిచ్‌ తమకు తగినంత సహకరించలేదని పేర్కొన్నాడు. అందుకే ఎంత బాగా బౌలింగ్‌ చేసినా ఇంగ్లండ్‌ ఆటగాళ్లు బాగా పరుగులు చేశారన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏ జట్టై పరిస్థితి అయినా అలానే ఉంటుందనన్నాడు. ముఖ్యంగా బెయిర్ స్టో.. క్రిస్ వోక్స్ పరుగుల వరద పారించి మ్యాచ్ ను పూర్తిగా తమ వైపుకు తిప్పేసుకున్నారని తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement