ప్రొ రెజ్లింగ్ లీగ్–2 లో హరియాణా హ్యామర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది.
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్–2 లో హరియాణా హ్యామర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం కేడీ జాదవ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 5–2తో యూపీ దంగల్ జట్టును చిత్తుగా ఓడించింది. హరియాణా తరఫున మజోమెడ్ కుర్బనలివ్ (70 కేజీలు), రజనీశ్ (65 కేజీలు), గడిసోవ్ (97 కేజీలు), సందీప్ తోమర్ (57 కేజీలు), సోఫియా మాట్సన్ (53 కేజీలు) గెలుపొందారు.
యూపీ దంగల్ తరఫున ఎలిట్సా యన్‌కోవా (48 కేజీలు), మారియా మమషుక్ (75 కేజీలు) తమ ప్రత్యర్థులను ఓడించారు. గురువారం జరిగే మ్యాచ్‌లో ముంబై మహారథితో ఎన్‌సీఆర్ పంజాబ్ రాయల్స్ తలపడుతుంది.