హరికృష్ణ రెండో గేమ్‌ ‘డ్రా’ | Harikrishna's Second Game 'Draw' | Sakshi
Sakshi News home page

హరికృష్ణ రెండో గేమ్‌ ‘డ్రా’

Apr 24 2017 1:15 AM | Updated on Aug 29 2018 1:16 PM

గషిమోవ్‌ స్మారక అంతర్జాతీయ సూపర్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ

షామ్‌కిర్‌ (అజర్‌బైజాన్‌): గషిమోవ్‌ స్మారక అంతర్జాతీయ సూపర్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ రెండో ‘డ్రా’ నమోదు చేశాడు. తెమూర్‌ రద్జబోవ్‌ (అజర్‌బైజాన్‌)తో ఆదివారం జరిగిన మూడో రౌండ్‌ గేమ్‌ను హరికృష్ణ 28 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.

మూడో రౌండ్‌ తర్వాత హరికృష్ణ ఒక పాయింట్‌తో మరో నలుగురితో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నాడు.
హారిక విజయం: ఐస్‌లాండ్‌లో జరుగుతున్న రెక్జావిక్‌ ఓపెన్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక ఖాతాలో నాలుగో విజయం చేరింది. విగ్నిర్‌ స్టెఫాన్సన్‌ (ఐస్‌లాండ్‌)తో జరిగిన ఆరో రౌండ్‌లో హారిక 38 ఎత్తుల్లో గెలిచింది. 

Advertisement
 
Advertisement
Advertisement