తలైవాస్‌ చిత్తు | Gujarat Fortune Giants Thrashes Thalaivas By 29 Points | Sakshi
Sakshi News home page

తలైవాస్‌ చిత్తు

Sep 29 2019 3:14 AM | Updated on Sep 29 2019 3:14 AM

Gujarat Fortune Giants Thrashes Thalaivas By 29 Points - Sakshi

పంచకుల: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో తమిళ్‌ తలైవాస్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ఔటైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ చేతిలో  50–21తో చిత్తుగా ఓడింది. గుజరాత్‌ రైడర్‌ సోను 15 రైడ్‌ పాయింట్లతో రాణించగా... ట్యాక్లింగ్‌లో హై–ఫై (5) సాధించిన పర్వేశ్‌ చక్కని సహకారం అందించాడు. మ్యాచ్‌లో గుజరాత్‌ ప్రత్యర్థిని మూడు సార్లు ఆలౌట్‌ చేసింది. తలైవాస్‌ స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి (5) నిరాశ పరిచాడు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 30–37తో యూపీ యోధ చేతిలో ఓడింది. యూపీ తరఫున శ్రీకాంత్‌ జాధవ్‌ సూపర్‌ ‘టెన్‌’ (11 పాయింట్లు) చెలరేగాడు. నితేశ్‌ కుమార్, సురేందర్‌ గిల్‌ చెరో ఏడు పాయింట్లతో రాణించారు. నేటి మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో దబంగ్‌ ఢిల్లీ; గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌తో హరియాణా స్టీలర్స్‌ తలపడతాయి.   

Advertisement
 
Advertisement
Advertisement